Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫ్యాక్టరీని పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పామ్ ఆయిల్ సాగు, ప్రభుత్వం అందించే రాయితీలు, భవిష్యత్‌లో విస్తరణపై అధ్య యనం చేసేందుకు ఆయిల్‌ఫెడ్ నర్సరీలు, కర్మాగారాలు, పామ్ ఆయిల్ క్షేత్రాలు సందర్శన కోసం మంగళవారం ఉద్యాన, సెరికల్చర్ కమిషనర్ వెంకట్రా మిరెడ్డి, ఇతర సచివాలయ (సెక్రటేరియట్) అధికారుల బృందం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. మంగళవారం ఈ బృందం ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు పామాయిల్ తోటలను పరిశీలించారు. అనంతరం ఏపీ సరిహద్దులో ఉన్న గోద్రేజ్ పామాయిల్ కర్మాగారాన్ని, అశ్వారావుపేట పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించారు. నారంవారిగూడెంలో గల ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడస్తున్న పామాయిల్ నర్సరీని పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్‌లో ప్రామాయిల్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ దశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకట్రా మిరెడీ నేత్రుత్వంలో సెక్రటేరియేటకు చెందిన డిప్యూటీ సెక్రటరీ భువనేశ్వరి, ఎగ్జి క్యూటివ్ సెక్రటరీ రేణుక' దేవి, అసిస్టెంట్ ఏపీడి వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ డైరక్టర సరోజని దేవి, లహరి, జిల్లా ఉద్యానశాఖ ఏడీహెచ్ మరియన్న, డీఓ ఉదరు కుమార్ బృందం పామాయిల్ తోటలు, నర్సరీలు, కర్మాగారాలు నిర్వహణ, మార్కేటింగ్, ప్రాసెసింగ్, క్వాలిటీ వంటివాటిపై అధ్యయనం చేశారు. అధ్యయన విషయాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ బృందంతో పాటు ఆయిల్‌ఫెడ్ డివిజన్ అధికారి ఉదరు కుమార్, అశ్వారా వుపేట ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ, డిప్యూటీ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.