Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
పినపాక నియోజకవర్గంలో పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బహుజనల ఆపదబంధువు అని టీఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ అన్నారు. ఇటీవల కేటీఆర్‌తో మాట్లాడి పేద విద్యార్ధికి మెడిసిన్ సీట్ ఇప్పియడం జరిగిందన్నారు. అలాగే రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో అనేక పేద ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తు అందరి మన్నలు పొందుతున్నారన్నారు. యువతకు మార్గదర్శకుడుగా నిలుస్తూ పార్టీ పదవులు ఇస్తూ రాజకీయంగా యువతకు రేగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2023లో రేగా కాంతారావు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి సాధిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు.