Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మండ మెలుగుటతో ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ జాతర
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని మారాయిగూడెం గ్రామంలో మేడారం తరహాలోనే అచ్చం ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులలో ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహించే సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతర ప్రారంభమైంది. 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతర సందర్బంగా తొలి రోజు మంగళవారం మండమెలుగుటతో జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దేవర బాలలు సోడి శాంతమ్మ, మడకం అచ్చమ్మలు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అడవి నుండి తెచ్చిన మండమెలుగటతో జాతర ప్రారంభం అయింది. జాతర నిర్వహణ కమిటీ సైతం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రదాన రహదారితో పాటు సమ్మక్క, సారలక్కల గద్దెలకు వెళ్లే రహదారులు మొత్తం వివిద దుకాణా సముదాయాలతో కళ కళ లాడుతున్నాయి. ప్రదా నద్వారం నుండి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే జాతరకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకోను న్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
నేడు గద్దెకు రానున్న సమ్మక్క: మారాయిగూడెం గిరిజన గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవములలో భాగంగా రెండవ రోజు బుధవారం సారలమ్మ తల్లి నేడు గద్దెకు చేరుకోనున్నది. ఒక్క పొద్దు రాత్రి పది గంటలకు తండ్రి పగిడిద్దరాజుతో కలసి దేవతా నిశానులు డప్పులు, డాన్సులు, కోయనృత్యాల నడుమ సారలమ్మ గుడికి చేరుకుంటుంది. మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి గద్దెలను దర్శించుకున్నారు.