Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టిక్కెట్ల గురించి మాట్లాడితే
సహించేది లేదు
అ నియోజకవర్గాల వారీగా పర్యటనలు
అ టీఆర్ఎస్లో గ్రూఫులు లేవ్..! ఒకటే
కేసీఆర్ గ్రూప్
అ టికెట్ కావాలనుకునే వారు
ఒళ్లువంచి పని చేయాలి
అ మీడియాతో ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని, రాబోయే ఎన్నికల్లో మాకు పోటీగా ఎవరూ లేరని, పోటీకి ఎవరూ రారని, జిల్లాలో టీఆర్ఎస్ టికెట్ల గురించి ఇతర నాయకులు నోరు విప్పితే సహించేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం సింగరేణి గెస్ట్ హౌస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. టీఆర్ఎస్కు ప్రజల నుండి అనుకూల ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామన్నారు. కొంత మంది నాయకులు టిక్కెట్లు వస్తాయని, మేమే పోటీ చేస్తామని మాట్లాడుతున్న తీరు పట్లఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కావాలి అనుకున్న వారు ఒళ్ళు వంచి పని చేయాలని, ప్రజలు, కార్యకర్తలతో మమేకమై ఉండాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి జిల్లాలో పార్టీ తీరును పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన భద్రాచలం పట్టణ కేంద్రంగా పర్యటన ప్రారంభిస్తున్నామని తెలిపారు. 5 నియోజకవర్గాలలో పర్యటించి పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ పక్షాన ఉన్నారని, జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు సందిగ్ధంలో ఉన్నారన్నారు. కొత్తగూడెం జిల్లా ఉద్యమకారులకు పెట్టింది పేరని తెలిపారు. ఉద్యమకారును నిర్లక్ష్యం చేసేదిలేదని, ఉద్యమకారులు లేనిదే పార్టీ లేదని ఉద్ఘాటించారు. ఉద్యమకారులకు సముచిత న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.