Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, వాటిని ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ అన్నారు. మండల కేంద్రంలోని దోసపాటి రంగారావు భారతి కల్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశం వాడి వేడిగా సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులను కోరారు. పథకాలను ప్రతి గడపకు తీసుక వెళ్ళినప్పుడే ప్రజలకు సీఎం కేసీఆర్ పెట్టిన పథకాల విలువ పూర్తిగా తెలుస్తాయని కార్యకర్తలని అందరిని తమ పార్టీ కంటికి రెప్పలా, కాపాడుకుంటు ఉందనీ భరోసా ఇచ్చారు. పార్టీకి పునాదులు గ్రామ, వార్డు, కమిటీలు అని ప్రభుత్వ పథకాలు గడపగడపకు చేరుతాయని తెలిపారు.