Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం కన్నులపండువగా సాగింది.ఉదయమే పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు,మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి కళ్యాణమూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చారు. ముందుగా భద్రాద్రి దివ్యక్షేత్ర మహత్యాన్ని భక్తులకు అర్చక స్వాములు తెలిపిన అనంతరం కళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణతంతును కన్నులపండువగా నిర్వహించారు.అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు.కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి నూతన వస్త్రాలు,అక్షింతలు, ప్రసాదం వితరణ గావించారు.ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.