Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ పినపాక
ఆ భార్యాభర్తలిద్దరూ రెక్క ఆడిస్తే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వారికి ఇద్దరు కుమారులు. జీవితం సంతోషంగా సాగుతుంది. ఆ కుటుంబంలో విధి తీవ్రంగా ఆడుకుంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోయి అనాథగా మారిన కుటుంబానికి అతనే పెద్దదిక్కు. అతని నేడు క్యాన్సర్ బారినపడి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామ పంచాయతీకి చెందిన యానబోయిన ఆదినారాయణ (25 సంవత్సరాలు) తాపీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అనుకోకుండా 6 నెలల క్రితం నోటిలో చిన్న కురుపు కావడంతో స్థానికుల దగ్గర వైద్యం చేయించుకొని పనికి వెళ్ళేవాడు. ఒక నెల రోజుల్లో ఆ పండు పెద్దగా కావడంతో మణుగూరు భద్రాచలం ఖమ్మం హాస్పిటల్ చుట్టూ మూడు నెలలు తిప్పారు. చివరగా ఖమ్మంలో పరీక్ష చేసి క్యాన్సర్ నిర్ధారణ చేశారు. దీంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా మారింది. కష్టపడి కట్టుకున్న ఇల్లును సైతం, భార్య మెడలో తాళి సైతం తాకట్టు పెట్టి, చుట్టుపక్కల వారి దగ్గర అప్పులు చేసి ఆదినారాయణ భార్య మల్లేశ్వరి, తల్లి రామనమ్మ 10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా అతను బతకాలంటే 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసిభార్యాభర్తలు, తల్లి అయోమయానికి లోనయ్యారు. ఆదినారాయణను కాపాడుకోవడం కోసం దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని భార్య మల్లీశ్వరి, తల్లి రమణమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే దాతలు 7207048772 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 62264894154(ూదీ×చీ0020611), ఫోన్ పే 8886827393 చేయాలని వేడుకున్నారు