Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మన ఊరు మన బడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలన్ని గుర్తించిన సందర్భంలో భాగంగా అన్నపురెడ్డిపల్లి మండలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించగా బుధవారం మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గుర్తించిన పాఠశాలల్లో ఏమి అవసరం వున్నాయి, అనేదానిని అయా గ్రామాల్లో గల గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు తో కలసి సమస్యలను పనులను గుర్తించి నివేదిక అందజేయాలని అనీ పాటశాలల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజపురం గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యం.పిం.పి యస్ పాఠశాలలు మన ఊరు మన బడి సెలక్ట్ కాగా హెడ్మాస్టర్లు గంగాధర్ నారాయణ ఇద్దరి సమక్షంలో పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలతో బడికి కావలసిన పనులను గుర్తించారు. పాఠశాలకు ప్రహరీ మంచినీటి సౌకర్యం విద్యుత్ ఫర్నీచర్ యం.పి.పి.యస్ పాఠశాలలో 5వ తరగతి వరకు వుండగా 3 తరగతులకు మాత్రమే భవనం వుండటం గతంలో వున్న ఒక భవనం శిథిలవస్థకు చేరడంతో రెండు గదులు భవనం, లైబ్రరీ, మంచినీటి సౌకర్యం విద్యుత్ తదితర సమస్యలు గుర్తించి ప్రతిపాదనలు పంపారు. ఇదే క్రమంలో చదువుకున్న పాఠశాల కోసం మేము వున్నాము అంటు పూర్వ విద్యార్థులు చిలుకూరి మధుసూధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి 11000 రూపాయలు ముద్రగడ దివ్యశ్రీ 5000 షేక్ జాని 5వేలు, రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి హెడ్మాస్టర్ గంగాధర్ నారాయణ పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఉపేందర్ రెడ్డి, ముద్రగడ వెంకటేశ్వరావు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు పాల్గన్నారు