Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐటీడీఏ ఏపీవో జనరల్, గిరిజన గురుకులాల ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్
నవతెలంగాణ-భద్రాచలం
జే.ఈ.ఈ, నీట్ ప్రవేశ పరీక్షకు ఇంటర్ విద్యార్థినిలను సన్నద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి డేవిడ్ రాజ్ ఆదేశించారు. బుధవారం భద్రాచలం గిరిజన గురుకుల కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల సి.ఓ.ఈ, అధ్యాపక బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ ఆదేశం ప్రకారం త్వరలో జరగనున్న జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తగు సూచనలు, సలహాలు అందజేసేందుకు అధ్యాపకులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోటీ పరీక్షల్లో విద్యార్థినిలు సీటు సాధించేలా ప్రతి లెక్చరర్ అంకితభావంతో సేవలందించాలని ఆయన సూచించారు. గిరిజన పిల్లలు ఉన్నత చదువులకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. గిరిజన విద్య కోసం ఐటీడీఏ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవ దాసు , కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.