Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ-చండ్రుగొండ
పాఠశాల అభివృద్ధికి చేయూతనిద్దామని ప్రజా ప్రతినిధులు పూర్వ విద్యార్థులు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మన ఊరు మన బడి పాఠశాలలో చేపట్టవలసిన కార్యక్రమాలను సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు త్రాగునీరు, ఫర్నిచర్స్, పెయింటింగ్ పెద్ద తరహా మరియు చిన్న తరహా మరమ్మతులు ఆకుపచ్చ బోర్డ్ ప్రహరీ గోడ వంటగది శిథిల భవనాలు స్థానంలో నూతన గదులు భోజన శాలలలు, డిజిటల్ సౌకర్యాలు, లైబ్రరీ తదితర పాఠశాల అభివృద్ధి అంశాలను గురించి వివరించడం జరిగినది. ఎంపీపీ బానోత్ పార్వతి మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందరూ అందించాలని తెలిపారు. ఎంపిడిఓ అన్నపూర్ణ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ఆనందకరమైనది అని తెలిపినారు. అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి సంజీవ రావు మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన వివిధ అవసరలు తీర్చుటకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం మనమందరం పాటుపడాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారా వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనంద్ కుమార్, కాంప్లెక్స్ సిఆర్పి సేవ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.