Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
మండల పరిధిలోని పలు గ్రామాల నుండి 'బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు' నినాదంతో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ చేపట్టిన దీక్షకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం భారీగా తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, మండల ఎంపీపీ బానోత్ సునీత పొన్నెకల్లు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఊపి మోటార్ సైకిల్‌ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఫత్యేమహ్మద్, అంతోటి అచ్చయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.