Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెనుబల్లి
టేకులపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు ఎవరు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగకుండా పాఠశాలకు రెవెన్యూ అధికారులు వచ్చి కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాములు, జడ్పిటిసి చక్కిలాల మోహన్ రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, సర్పంచి రాసూరి జయమ్మ, ప్రిన్సిపాల్ నాగరాజు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కనగాల వెంకటరావు, చింతనిప్పు సత్యనారాయణ, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, చక్కిలాల లక్ష్మణరావు, కేసరి శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.