Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
పెనుబల్లి మండలం ఏడ్లబంజర్ గ్రామానికి చెందిన జంపా సాయిబాబ కుమారుడు సూర్య ప్రకాశ్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. మృతుని భార్య దుర్గాకి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, ఎంపీపీ లక్కీనేని అలేఖ్య వినీల్, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరావు, పిఎసిఎస్ అధ్యక్షులు చింతనిప్పు సత్యనారాయణ, చీకటి రామారావు, మందలపు అశోక్, యడ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.