Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
డెవలప్ మెంట్ చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ఇప్పటికే అధికంగా బిల్లుల్లో వచ్చిన వాటిని తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు విద్యుత్ అధికారులను కోరారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెవలప్ మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ పేరుతో పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నేరుగా విద్యుత్ చార్జీలు పెంచకుండా సామాన్య ప్రజలపై దొంగచాటుగా డెవలప్ మెంట్ చార్జీల పేరుతో అధికంగా బిల్లులు వసూలు చేయటం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. రెండు నెలల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని, కట్టిన వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సునీత గుగులోతు నరేష్ ఉమ్మనేని రవి గూగు లోతు పంతు తదితరులు పాల్గొన్నారు.