Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండల వ్యవసాయ అధికారి భాస్కర్రావు
నవతెలంగాణ-రఘునాథపాలెం
రైతులు కల్లాలు నిర్మించుకోవాలని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ రావు, ఏఈఓ కార్తీక్ కోరారు. ఈ మేరకు కోయ చలక గ్రామపంచాయతీలో ప్రతి రైతులను కలసి పంట కల్లాల నిర్మాణం వల్ల కలిగే లాభాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఒక్కో కల్లం నిర్మాణానికి 85 వేల రూపాయలు మంజూరు చేస్తుందని, దీనికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం బీసీ, ఓసి రైతులకు 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామం లో 13మంది రైతులకు మంజూరయ్యాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని రైతులకు అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధంశెట్టి హరిప్రసాద్, సొసైటీ డైరెక్టర్ కటారి సుజాత, వార్డ్ సభ్యులు చెరుకూరి అనూష కృష్ణారావు, అమరం వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.