Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మిర్చి పంట తుడిచిపెట్టక పోయి ఆప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కారేపల్లి మండలం తవిసిబోడుకు చెందిన రైతు భూక్యా చందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టిన పెట్టుబడులు రాక పోగా చేసిన చాకిరి దండగ అయిందని దీంతో రైతులు మనోధైర్యం కోల్పోతున్నారన్నారు.ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించటం మూలంగానే రైతు భూక్యా చందర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రైతు కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుది పోడు భూమి కావటంతో దానికి రైతు బీమా వర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన రైతులు అధికంగా అప్పుల పాలైనారని, ప్రభుత్వం మిర్చి రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవటానికి చర్యలు చేపట్టాలని కోరారు.