Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి మండలంలో గత ఏడున్నర ఏండ్లలో కేవలం 80 ఇండ్లు మాత్రమే ఇచ్చారని, ఇంకా అర్హులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రేజర్ల, యాతాలకుంట గ్రామాల్లో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిం చారు. రామానగరంలో మంజూరైన ఇండ్లకు స్థలం లేదనే సాకు చూపి అధికార యంత్రాంగం తాత్సారం చేస్తుందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని లేనిపక్షంలో సొంత స్థలంలో ఇండ్లు కట్టుకుంటే రూ.10లక్షలు సబ్సిడీ అందించే పధకాన్నైనా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లకీëనారాయణ, చిట్టెమ్మ, హిమాన్బీ, అఫ్జల్, హనుమంతరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.