Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం మాణిక్యారం కోయగుంపులో బుధవారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. బుధవారం రాత్రి సారలమ్మ అమ్మను వనం నుండి గిరిజనులు ఊరేగింపుగా తీసుకవచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. పూజారి చింత సురేష్ జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈసందర్బంగా ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. అమ్మవారిని సర్పంచ్ కుర్సం సత్యనారా యణ, మాజీ సోసైటీ అధ్యక్షులు ఈసాల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కరపటీ సీతారాములు, విశ్రాంత డీఎస్పీ కుర్సం సీతారాములు, పెద్దలు తుళ్లూరి వెంకటేశ్వర్లు(పత్తిబాబు), పర్శిక వెంకటేశ్వర్లు లు తోడ్కోని వచ్చారు. దీంతో జాతర ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా సారలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు నిర్వాహణ కమిటీ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసింది. జాతరను కమిటీ సభ్యులు కరపటి లక్ష్మయ్య, కుర్సం నాగేశ్వరరావు, వజ్జా వెంకన్న కల్తిరామచంద్రు, యాదగిరి పర్యవేక్షించారు.