Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
భూ తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాధ్ అన్నారు. బుధవారం కారేపల్లి మండలం విశ్వనాధపల్లి రెవిన్యూ గ్రామపరిధిలోని అజ్మీర నారాయణ, షేకÊ మౌలాలీల అనే ఇద్దరు రైతుల మధ్య భూ వివాదం నడుస్తుంది. దీనిపై అజ్మీర నారాయణ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో ఆర్డీవో వివాదభూమిని పరిశీలించారు. ఇరువురు రైతులతో చర్చించారు. అంతకు ముందు సర్వే సిబ్బంది భూమిని సర్వే చేశారు. ఈసందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇరువురి భూములు సరిగానే ఉన్నాయన్నారు. నారాయణకు సంబంధించి కొంత భూమి సాంకేతిక సమస్యతో ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. ఆ సమస్యను వెంటనే పరిష్కారం చూపి ఇరువురికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆర్డీవో వెంట తహసీల్ధార్ కోటా రవికుమార్, ఆర్ఐ సక్రు, సర్వేయర్ సాధిక్, ఈశ్వరి ఉన్నారు.