Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడ్జి ఎండి అబ్దుల్ జవీద్ పాషా
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
అవసరమైన ప్రతి వ్యక్తికి న్యాయ సహాయం అందిచడానికి జిల్లా న్యాయ సేవా సంస్థ సిద్దంగా ఉందని ఆర్ధిక స్థోమత లేదనే కారణంగా ఏ వ్యక్తి అయినా న్యాయం పొందడానికి అర్హత కోల్పోకూడదని న్యాయసాయం అందిచడానికి న్యాయ వాదులు కూడా కక్షిదారులకు ఏమాత్రం లోపం లేకుండా తమ క్లైంట్ కి సేవ చేయాలని జడ్జి ఎండి అబ్దుల్ జవీద్ పాషా అన్నారు. గురువారం న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వివిధ మేజిస్ట్రేట్ కోర్ట్లకు సంబంధించిన లీగల్ ఎయిడెడ్ కౌన్సిల్ తమ తమ కోర్ట్ లో సంబంధించిన కేసుల వివరాలను ప్రతీ నెల విధిగా ఇవ్వాలని న్యాయ సహాయం అందించిన వివిధ కేసులకు సంబంధించి పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి మేజిస్ట్రేట్ కోర్టులకు కేటాయించిన న్యాయ వాదులు యిమ్మడి లక్షీ నారాయణ, తులసి బాబు, మానటరింగ్ మెంబర్ పి పద్మావతి మరియు న్యాయ వాదులు పాల్గొన్నారు.