Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంఈఓ ఇందిరా జ్యోతి
నవతెలంగాణ-బోనకల్
మన ఊరు - మన బడి కింద ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందని మండల విద్యాశాఖ అధికారి ఎం ఇందిరా జ్యోతి, మండల పిఆర్ ఏఈ మొండితోక నవీన్ తెలిపారు. మండల విద్యావనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి ఎం.ఇందిరా జ్యోతి అధ్యక్షతన మన ఊరు - మన బడి సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ పధకం కింద ఎంపికైన 15 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ లకు విధివిధానాలపై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి ఎం.ఇందిరాజ్యోతి మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు బాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలని చేయాలని కోరారు. ఈ అకౌంట్‌ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆ గ్రామ సర్పంచ్ విద్యా కమిటీ చైర్మన్ పిఆర్ ఏఈ లతో కలిసి బ్యాంక్ ఎకౌంటు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించి నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వల్లంకొండ రాంబాబు, గూగు లోతు రామకృష్ణ, జల్లా కోటయ్య, డి. రత్నకుమారి, ఎస్ బాబు, పడిగల రవి, టి. హరిప్రసాద్ సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, కేతినేని ఇందు, జెర్రిపోతుల రవీంద్ర, కొమ్మినేని ఉపేందర్, మర్రి తిరుపతిరావు, విద్యా కమిటీ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.