Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి పరిరక్షణ కోస
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
అ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి సి.త్యాగరాజన్
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దశల వారి ఆందోళనలు నిర్వహిస్తామని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.త్యాగరాజన్ పిలుపునిచ్చారు. గురువారం ఓసీ 2లో ఫిట్ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోలేటి నుండి జేవిఆర్ సత్తుపల్లి వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. ధర్నాలు, ధీక్షలు నిర్వహిస్తూ దశల వారి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నెల 22 తేది నుండి ఫిబ్రవరి చివరి వరకు ఫీట్ మీటింగ్‌లు, మార్చి 2న జీఎం ఆఫీసు ముందు ధర్నాలు, మార్చి 3న గేట్ మీటింగ్‌లు, 4వ తేదీన ఎస్ఆర్కె శ్రీరాంపూర్‌లో బహిరంగసభ, 5వ తేదీన ప్రజాసంఘాలు కాంగ్రెస్ పార్టీతో కలిపి బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే వరకూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని, ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నారు. భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ, ఇంధిరాగాంధీలు ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సాహించి అభివృద్ధి పరిచారన్నారు. నేడు మోదీ అధికార బలంతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, ఆదాని, అంబానీల ఆస్తులను పెంచుతున్నారన్నారు. దానికి అనుగుణంగానే చట్టాలను తయారు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. అక్కడక్కడ ధర్నాలు చేస్తుందన్నారని, అలా కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు నాయకులు అధ్వర్యంలో ఢిల్లీలో పోరాటాలు నిర్వహించాలన్నారు. కేంద్రప్రభుత్వం నుండి సింగరేణికి రూ.14 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిని చెల్లిస్తే వెంటనే సింగరేణి కొత్త బొగ్గు గనుల విస్తరణ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురిజాల గోపి, ఐఎన్టియూసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్, నియోజకవర్గ నాయకులు మాజీ జడ్పీటీసీ బట్టా విజరుగాంధి, యం.లక్ష్మణ్, కొమరం. రాంమూర్తి, కొత్తగూడెం ఉపాధ్యక్షులు అల్బర్ట్, ఎం.శ్రీను, పాల్వంచ రాములు, షరీఫ్, వరలక్ష్మీ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.