Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
విద్యార్థుల్లో పఠనానైపుణ్యాన్ని పెంపొందించాలని జిల్లా విద్యా విభాగపు అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్ కోరారు. నాగులవంచలో జరిగిన కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాన్ని పెంపొందించడం వలన భాష అభివృద్ధిని పెంపొందించవచ్చని తెలిపారు. పాఠ శాలలో నూరు శాతం హాజరు అయ్యే విధంగా విద్యార్థిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశంలో తమ అభిప్రాయాలను పరస్పరం బదిలీ చేసుకోవాలని కోరారు. రీడ్ పోగ్రామ్ విద్యార్థుల నూటికి నూరు శాతం హాజరులో చింతకాని మండలం ముందంజలో ఉన్నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా విద్యా విభాగపు అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, మండల విద్యాశాఖఅధికారి మోదుగు శ్యాంసన్లను సన్మాంచారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మోదుగు శ్యాంసన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, అసిస్టెంట్ సెక్రటరీ శివ నారాయణరెడ్డి, సిఆర్పి పద్మజ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, రాజయ్య, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.