Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
గ్రామసేవకుల సమస్యలను పరిష్కారి ంచాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కారేపల్లిలో వీఆర్ఏలు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్బంగా వీఆర్ఏ సంఘం జిల్లా నాయకులు బొందల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేస్తానని హామీ ఇచ్చారని అది కార్యరూపం దాల్చక పోవటం విచారకరమన్నారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని, వారసులకు ఉద్యోగాలు కల్పన చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షకార్యదర్శులు ఆముదాల విజరు, వెంకన్న, ఉపాధ్యక్షులు కొండబోయిన జ్యోతిబాసు, నాయకులు వెంకటేష్, శ్రీను, కవిత రామకృష్ణ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : విఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తు వీఆర్ఎలు మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వీఆర్ఎల సంఘం జిల్లా అద్యక్షుడు లింగరాజు మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో తహసీల్దారు కార్యాలయంలో రాత్రి పూట విధులు నిర్వహిస్తు గుండెపోటుతో మృతిచెందిన వీఆర్ఏ గంగాధర్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విఆర్ఏలు సోందుమియా, వీరయ్య, అజరు, ఉపేందర్, నాగరాజు, మురళి, మౌనిక, సువర్ణ పాల్గొన్నారు..