Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టిఆర్ఎస్ పార్టీలో గ్రూపులు వద్దు
అ మధిర ఎమ్మెల్యేని అవుతా : బొమ్మెర రామ్మూర్తి
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వారే పార్టీని విమర్శిస్తున్నారని తెలంగాణ ఉద్యమ గాయకుడు, ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ మెంబెర్, తెరాస రాష్ట్ర నాయకుడు బొమ్మెర రామమూర్తి అన్నారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో గల ప్రెస్ ఛాంబర్లో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మధిర నుంచి ఎమ్మెల్యే అవుతానని ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. మధిరలో గ్రూపు రాజకీయాలకు తా వులేదని, మొదటి నుండి పార్టీలో చురుకుగా పని చేసిన వాళ్ళు కనుమరుగవుతున్నారని, అందరిని కలుపుకొని పోతే టిఆర్ఎస్ పార్టీకికి మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. వెనుకా ముందుగా పార్టీలోకి వచ్చినా, అందరూ పార్టీ మనుషులేనని, అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే గెలుపు తథ్యమన్నారు. కొందరు నాయకులు పదవుల కోసమే, పదవులు ఉంటేనే పనిచేస్తు న్నారని, అలాంటి వారికి టిఆర్ఎస్లో చోటు ఉండదన్నారు. సమావేశంలో జాగృతి జిల్లా నాయకులు, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబూరావు, టిఆర్ఎస్ నాయకులు కృష్ణార్జునరాజు, ఆకుల నాగే శ్వరరావు, చిన్నం రాము, పెద్దగొపవరం సర్పంచ్ ఇనపనూరి శివాజీ, విద్యార్థి నాయకులు మీనుగు చైతన్య, దోర్నాల దినాకర్, సతీష్ మహాజన్ పాల్గొన్నారు.