Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియాలో క్వాటర్స్ కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్ అన్నారు. గురువారం యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. క్వాటర్స్ అవకతవకల కారణంగా సినీయర్ కార్మికులకు, సూపర్వైజర్లు, క్లర్క్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు. కొంతమంది కావాలని అర్హత లేకున్నా టీబీజీకేఎస్ అండదండలు ఉన్నాయని క్వాటర్స్ కేటాయించడం సరైంది కాదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు క్వాటర్స్‌లో నివాసం ఉంటుంటే సింగరేణి కార్మికులు అద్దెకు ప్రైవేట్ ఇండ్లలో ఉంటూ ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. మేనేజ్మెంట్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కార్పొరేట్ నిబంధనలు పాటిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా క్వాటర్స్ కేటాయించాలన్నారు.