Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్‌ను ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలి : పీఓ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న కిన్నెరసానిలోని క్రీడా పాఠశాలలో చదువుకున్న విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో ప్రో వాలీబాల్‌లో ఆడడం గర్వించదగ్గ విషయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం తన చాంబర్లో టి.నవీన్, కోచ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రో వాలీబాల్ టోర్నమెంట్లో చైన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలలోని ఆటగాళ్లను అదేవిధంగా భారతదేశం తరఫున ఆడిన ఆటగాళ్లను ఎంపిక చేసి మొత్తం 7 జట్లుగా ఈ టోర్నీ జరుగుతుందని అలాంటి ఉత్తమమైన టోర్నీలో మన విద్యార్థి ఉండటం చాలా శుభ సూచకమని ఆయన అన్నారు. ఈ ఒక్క విద్యార్థి మన కిన్నెరసాని క్రీడ పాఠశాలలో చదువుకుంటూ తనకున్న మక్కువ వలన ప్రస్తుత క్రీడల అధికారి వీరు నాయక్, పీడీ రాంబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వలన అతనికి ఈ అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థినీ, విద్యార్థులు వారి అభిరుచి బట్టి సంబంధిత పీడీలు సహకారంతో ఆటలు ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, క్రీడా అధికారి వీరు నాయక్, కోచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.