Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిండు జాతరకు భారీగా తరలి వచ్చిన అశేష భక్త జనం
అ సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకున్న ప్రముఖలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని తెలంగాణ, ఛత్తీష్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మారాయిగూడెం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం తల్లి సమ్మక్క గుట్ట నుండి గుడికి చేరుకుంది. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అడవి నుండి వనం రాకతో నిండు జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు దేవరబాలల సోడి శాంతమ్మ, మడకం అచ్చమ్మల ఆశీస్సులు కోసం ఎగబడ్డారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆశేష భక్తుల నడుమ కోయ డాన్సులు, కొమ్ము నృత్యాలు, డప్పులు, డాన్సులు దేవతా నిశానుల పూనకాల నడుమ బోనాలతో తల్లి పమ్మక్క గద్దెకు చేరుకుంది. కాగా నిండు జాతర పందర్బంగా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు బెల్లం(బంగారం) వంటి మొక్కు బడులు చెల్లించుకున్నారు. జాతర కమిటీ వాలంటీర్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తొడెం తిరుపతిరావు శానిటేషన్ పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు.
అమ్మవారి గద్దెలను దర్శించుకున్న ప్రముఖులు : మారాయిగూడెం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాలలో సందర్భంగా నిండు జాతరకు ప్రముఖులు తరలి వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. భద్రాచలం దేవస్థానం ఈఓ శివాజీ కుటుంబ సభ్యులతో వచ్చి దర్శించుకోవడంతో పాటు దేవరబాలల ఆశీర్వచనం తీసుకున్నారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే చందాలింగయ్య దొర, ఎంపీపీ రేసు లకీë, జెడ్పీటీసీ సీతమ్మ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు తదితరులు వచ్చి అమ్మవారి గద్దెలను దర్శించుకున్నారు.