Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రుద్రంపూర్ ఎస్ఆర్టీ పరిరక్షణ, రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ రుద్రంపూర్ ఏరియాలో 60ఏండ్లుగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను ఓపెన్ కాస్ట్ కారణంగా సింగరేణి యాజమాన్యం దౌర్జన్యంగా కూల్చుట నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సింగరేణి యాజమాన్య నిరంకుశ వైఖరికి నిరసనగా వంటా వార్పు కార్యక్రమం, జిఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గూడేల్లి యాకయ్య, టీఆర్ఎస్ నాయకులు ఉమర్, కాంగ్రెస్ నాయకులు కాలం నాగభూషణం, అంతోటి పాల్, ఎంపీటీసీలు పరమేష్, ఆర్తి మక్కడ్, లట్టి జగన్మోహన్, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.