Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామ పంచాయతీ ఈఓకు వినతి నవతెలంగాణ-భద్రాచలం
పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో జనా వాసాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ పనులను నిలిపి వేయాలని స్థానిక ప్రజలు గ్రామ పంచాయతీ ఈఓకి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ నగర్ స్థానికులు మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్న సిద్ధార్థ స్కూల్‌కి అతి సమీపంలో అదేవిధంగా రోజు భక్తులతో కిటకిటలా డుతున్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి అతి సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఇంటి డాబాపై సెల్ టవర్ నిర్మిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల అనుమతి పొందకుండా గుడికి, బడికి దూరంగా ఉండాల్సిన సెల్ టవర్ జనా వాసాల మధ్య ఏర్పాటు చేస్తే దాని ద్వారా వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వారు అన్నారు. వెంటనే ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే శుక్రవారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధం గా టవర్ నిర్మాణ పనులను అడ్డుకుంటా మని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఈవో మాట్లాడుతూ వెంటనే పనులు పరిశీలించి ప్రజల అభ్యర్థన మేరకు నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్ర మంలో స్థానిక ప్రజలు చిన్న నర్సారెడ్డి, ఎం రాంప్రసాద్, రాజు, బి సాంబయ్య, ప్రవీణ్ రెడ్డి, రాము, కిరణ్ కుమార్, ఆర్‌కెవి రమణ, ఎస్ కార్తీక్, రామ్ కిషన్, చంద్రశేఖర్ ,విజరు కుమార్ ,సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు డి సతీష్ బాబు, శాఖ కార్యదర్శి చెన్నూరు వెంకటరమణ పాల్గొన్నారు.