Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాఠశాలకు 100 శాతం
పిల్లలు హాజరయ్యేలా చూడాలి
అ పీఓ గౌతమ్ పొట్రు
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన పిల్లల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ పాత రోజులు మరిచిపోయి ప్రధాన ఉపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్ పాఠశాలలో పనిచేసే సిబ్బందితో సహా స్థానికంగా ఉండి సమయపాలన పాటించి పిల్లలకు చక్కటి విద్యా బోధనతో పాటు పాఠశాలకు 100 శాతం పిల్లలు హాజరయ్యేలా సంబంధిత హెచ్ఎంలు టీచర్లు బాధ్యత వహించాలని పీఓ గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం భద్రాచలంలోని సమ్మక్క, సారక్క ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏటీడీవోలు, ఎస్సీఆర్పీలు, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లతో పాఠశాలల పనితీరుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాగా పని చేయాలని, పాఠశాల షెడ్యూల్ తప్పకుండా నిర్వహించాలని, ఎవరైనా సిబ్బంది ప్రధానోపా ధ్యాయులు ఉపాధ్యాయులుపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అలాగే ఏటీడబ్ల్యూలు వారి పరిధిలోని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలో మెనూ ప్రకారం మంచి పౌష్టికరమైన ఆహారం పిల్లలకు అందించాలని ఆయన అన్నారు. పిల్లలకు ఇంగ్లీషులో బోధన చేస్తే వారి మేధాశక్తి పెరుగుతుందని ఆయన అన్నారు. త్వరలో ప్రతి పాఠశాల, వసతి గృహాలలో బడ్జెట్ రాగానే అద నపు గదులు నిర్మిస్తామని ఆయన పేర్కొ న్నారు. డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఖమ్మం డీటీడీఓ కృష్ణా నాయక్, భద్రాచలం, వైరా ఇల్లందు, దమ్మపేట, ఏటీడీఓలు నరసింహారావు, తిరుమల రావు, కౌసల్య, పవన్ కుమార్, ఏసీఎంఓలు రమణయ్య, రాములు, జీసీడీఓ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.