Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం) నిర్మాణాన్ని పటిష్ట పరచడమే అమరజీవి కామ్రేడ్ ముది గొండ నాగేశ్వరరావుకు మనం అందించే ఘన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలగాని బ్రహ్మచారి అన్నారు. అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వర రావు 6వ వర్ధంతి సందర్భంగా గురువారం పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్ ఆవిష్కరించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మచారి మాట్లాడుతూ భద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యునిగా, వ్యాపారవేత్తగా భద్రాచలం పట్టణంలో ముదిగొండ నాగేశ్వ రరావు ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు పార్టీ పోరాటాలలో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని పార్టీ ఇచ్చిన బాధ్యతకు కట్టుబడి పనిచేసేవారని ఆయన అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ మతం, కులం పేరుతో సాంప్రదాయాలు కట్టుబాట్లు పేరుతో ప్రజలను చీల్చాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని ఈ విధానాలకు వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి ఐక్యంగా పోరాటాలు నిర్వహించడమే కామ్రేడ్ నాగేశ్వరావుకు మనం అందించే నివాళి అని ఆయన అన్నారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక, కుటుంబ సభ్యులు ముదిగొండ ధనలక్ష్మి, రామారావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ రెడ్డి, బండారు శరత్ బాబు, వై.వెంకటరామారావు, నాదెళ్ల లీలావతి, సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు సీతా లక్ష్మి, జ్యోతి యం.వి ప్రసాద్ రావు, నాగరాజు, లక్ష్మణ్, ఫిరోజ్, ఎస్.రామకృష్ణ, యం.వి.ఎస్ నారాయణ , కుంజా శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప తదితరులు పాల్గొన్నారు.