Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఏఎంసి మాజీ ఛైర్మన్ మద్దినేని వెంకటరమణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన రఘునాథపాలెంలోని అంగన్వాడీ-3 కేంద్రానికి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు తరుపున నిర్వాహకులు పరిశపుల్లయ్య ఆధ్వర్యంలో గర్భిణీలకు అవసరమైన ఐదు కుర్చీలతో పాటు చిన్నారులు కూర్చునేందుకు అవసరమైన 20 కుర్చీలు, పలకలను మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మద్దినేని వెంకటరమణ, నాయకులు గుడిపూడి రామారావు చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ ఈలపోలు లక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో బస్తీ దావాఖాన వైద్యురాలు టి. ఉపారాణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనుమోలు రఘు, వార్డు సభ్యులు వై.రేణుక, ఏఎన్ఎం టి.రోహిణి, ఆరా కార్యకర్త సలోని, ఆయా కొండమ్మ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.