Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ పివి గౌతమ్
నవతెలంగాణ-కల్లూరు
పాఠశాలల్లో విద్యార్థులు వందశాతం హాజరు ఉండేటట్లుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కల్లూరు ,చెన్నూరు ప్రాథమిక పాఠశాల హైస్కూల్‌ను సందర్శించారు.ఈ సందర్బంగా తరగతి గదులను పరిశీలించారు పాఠశాల కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాలలోని రికార్డును పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆప్సెంట్ కావటంతో ఎందుకు అయ్యారని ప్రశ్నించారు. హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని విద్యార్థులు లేకుండా మీరేం చేస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం కల్లూరు ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కుల ఆదాయం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ పి వీ గౌతమ్,సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య లు మాట్లాడుతూ పదో తరగతిలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్ పై అవగాహన కల్పించి ఉన్నత చదువులు చదువుకునేందుకు వారిలో ఓ లక్ష్యాన్ని ఏర్పరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ డీఈవో యాదయ్య ఎంఇఒ ఎం.రాములు మండల ప్రత్యేక అధికారి సునీత, తహసీల్దార్ బాబ్జీ .ప్రసాద్, ఎండీవో టి.శ్రీనివాసరావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, ఎంపీపి బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయకుమార్, సొసైటీ అధ్యక్షులు పాలెపు రామారావు, డిసిసిబి డైరక్టర్ బోబోలు. లక్ష్మణ్‌రావు, జడ్పీటీసీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఇస్మాయిల్ పాల్గొన్నారు.