Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహౌత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ నీరజ, సుడా చైర్మెన్ బచ్చు విజరుకుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం హాజరయ్యారు. అనంతరం తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులకు శాలువాలు కప్పి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా సుడా ఛైర్మెన్ మాట్లాడుతూ రియల్టర్స్, బిల్డర్స్, డెవలపర్స్ ప్రతి ఒక్కరు డీటీసీపీ అనుమతి పొందిన తర్వాతే వెంచర్లలో పనులను చేపట్టాలని కోరారు. డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లు సేల్స్ చేయవద్దని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలని మంత్రి పువ్వాడ అజరు కుమార్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మక్బూల్, పాలెపు విజయ, దాదే అమృతమ్మ, పాకలపాటి శేషగిరి, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు అన్నం వీరప్రసాద్రావు, ప్రధాన కార్యదర్శి సూర విష్ణు చౌదరి, గరికిపాటి ఆంజనేయ ప్రసాద్, మస్తాన్, అసోసియేషన్ రియల్టర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,