Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండలవైద్యాధికారి మోత్యా
నవతెలంగాణ- కొణిజర్ల
పల్స్ పోలియో లో భాగంగా మండల పిహెచ్సి పరిధిలో ఈ నెల 27,28, మార్చి 1 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని మండలవైద్యాధికారి మోత్యా నాయక్ పిలుపునిచ్చారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన చిన్న పిల్లలనుంచి ఐదుసంవత్సరాల చిన్నారుల కు రెండు చుక్కలు చొప్పున పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. పిహెచ్ సి పరిధిలో 3380 మంది పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. వీరి తో పాటు సంచార పిల్లల కు కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు.మొదటి రోజు బూత్ ల లో, రెండు మూడు రోజులు సిబ్బంది ఇంటిఇంటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. పిహెచ్ సి పరిధిలో 28 పోలియో బూతుల ఏర్పాటు చేసి నూరుశాతం పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వైద్యాధికారి ఓప్రకటనలో తెలిపారు.