Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం గేటురేలకాయపల్లి, ఫైల్తండా, రేలకాయలపల్లి, తవిసిబోడు గ్రామాల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమేరాలను ఏసీపీ బస్వారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయాల్లో కంట్రోల్ యూనిట్ ప్రారంభించి ఏసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమేరాలు కీలకంగా మారాయన్నారు. సీసీ కెమేరాల పుటేజీ ద్వారా నేరపరిశోధన చేసి ఎన్నో కేసులను ఛేదించటం జరిగిందని తెలిపారు. సీసీ కెమేరాలు ఉంటే గుర్తుతెలియని వ్యక్తుల సంచారం, ఘర్షణలు, ఆవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో సీసీ కెమేరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. మారు మూల ఏజన్సీ గ్రామాల్లో సీసీ కెమేరా ఏర్పాటు చేసిన సర్పంచ్‌లను ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, సీఐ అరిఫ్ అలీఖాన్, ఎస్సై కుశకుమార్, సర్పంచ్‌లు భూక్యా రమణ, బానోత్ సక్రాం, ఎంపీటీసీ ధర్మసోత్ శంకర్ కార్యదర్శులు బానోత్ వెంకట్‌సింగ్, అజ్మీర రాజు, గ్రామపెద్దలు గణితి ముత్యాలరావు, అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.