Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్యాణలక్ష్మి చెక్కులు పంచడం చేతకాదు కాని పాదయాత్రలా ..?
జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
పార్టీ పదవులలో ప్రజాప్రతినిధులుగా ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేయని వారిని మార్చాలనే ఉద్దేశంతో మార్పు చేయటం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బనిగండ్లపాడు గ్రామంలో గల రైతు వేదిక వద్ద నూతనంగా ఏర్పాటు చేయబడిన మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి చెక్కులను శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందిస్తుంటే మధిర నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంచటానికి రావడం చేతకాదు కాని పాదయాత్రలు చేస్తున్నారని, పాదయాత్రలు ఎందుకని భట్టిని ప్రశ్నించారు. అనంతరం మండల రైతు బంధు సమితి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్‌గా వేమిరెడ్డి బాల రాఘవరెడ్డిని అభినందించారు. అనంతరం ఎర్రుపాలెం మండల ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు ఎర్రమల శ్రీనివాస్‌రెడ్డి, తోట సాంబశివరావులను శాలువాతో సన్మానించారు. బనిగండ్లపాడు గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణరెడ్డి, మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత, చావా రామకృష్ణ, అంకసాల శ్రీనివాసరావు, మొగిలి అప్పారావు, పంబి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.