Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మండలం లోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు ఖమ్మం కార్పొరేషన్‌లోని దానవాయిగూడెం, మండలంలోని సత్య నారాయణపురం, జలగంనగర్, ఆరెకోడు, తెల్దారుపల్లి, తీర్థాల గ్రామాల్లో పర్యటించారు. జలగం నగర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇటీవల సాగర్ కాల్వలో పడి మృతిచెందిన ఆరెకోడు గ్రామానికి చెందిన పరశురాం, నందిని దంపతుల ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆరెకోడులో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. తీర్ధాల జాతర ఏర్పాట్లను పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన తీర్థాల సంగమేశ్వర ఆలయ కమిటీ చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యడ్లపల్లి వరప్రసాద్, తహసీల్దారు సుమ, ఎంపీడీవో అశోక్ కుమార్, టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, సుడా డైరెక్టర్ గుడా సంజీవ రెడ్డి, ముత్యం కృష్ణారావు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.