Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నాయకత్వంలో ఖమ్మం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ అన్నారు. శుక్రవారం సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి లకారం ట్యాంక్ నందు పర్యటించారు. ఖమ్మం ప్రజలకు ఆహ్లాదంతోపాటు మధుర అనుభూతి పంచేందుకు లకారం ట్యాంక్ బండ్ పై మంత్రి పువ్వాడ అజరు కుమార్ పర్యవేక్షణలో నూతనంగా ఏర్పాటు చేసిన తీగల వంతెన సస్పెన్షన్ బ్రిడ్జిని పరిశీలిం చారు.అనంతరం ట్యాంక్ బండ్ పై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ రంగారావు, ధరణి కుమార్, ఎఈ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.