Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీలర్, కంపెనీ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
నవతెలంగాణ-గాంధీచౌక్
నకిలీ పొద్దుతిరుగుడు విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, శాస్త్రవేత్తల బృందం పంటలను పరిశీలించి న్యాయం చేయాలని, గత 20 రోజులు క్రితం జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా ఇంతవరకు స్పందించడం లేదని ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం ముదిగొండ మండలం గోకెనపల్లి రైతులు ఆందోళన నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయం చేసిన డీలర్, కంపెనీపై చర్యలు తీసుకోవాలని, రైతులు ఎకరాకు ముప్పై వేల రూపాయలు పేరుగా ఖర్చు పెట్టి నష్టపోయి ఉన్నారని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ నిర్మల సోమవారం నాటికి శాస్తవ్రేత్తల బృందం పంటలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, రైతులు ఎస్కె సోందు, రమేష్, ముకత్తం చంద్రయ్య, శ్రీనివాస్, పాలడుగు రామయ్య, వీరయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు