Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని, నిరుద్యోగ భృతి రూ.10 వేలు ఇవ్వాలని, స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వటంతో పాటుగా, నిరుద్యోగ భృతి పదివేల రూపాయలు గ్రూప్‌లో ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలని, వెంటనే నిరుద్యోగ భృతి విధి విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా లోన్స్ మంజూరు చేయాలన్నారు. జిల్లాలో మూడు లక్షలు పైగా ఉన్నారని, వారి కోసం స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరుద్యోగ సమస్య ఉద్యమంలో ఉద్యోగులు అందరూ కలిసి రావాలని కోరారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ, జడ్పీ చైర్మన్, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు . అనంతరం ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, కడతల వెంకటేశ్వర్లు, శీలం వీరబాబు, కూరపాటి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, అశోక్, బాలు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.