Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 45వ జిల్లా మహాసభ స్థానిక బోడేపూడి భవనంలో శుక్రవారం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, ప్రముఖ విద్యావేత్తలు సంక్రాంతి రవికుమార్, బోడపట్ల రవీందర్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొంతు రాంబాబు మాట్లాడుతూ అధ్య యనం, పోరాటం నినాదంతో స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో 1970లో ఎస్ఎఫ్ఐ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యా రంగంలో వస్తున్న సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. దేశంలోని అగ్రగామి విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఉందని, కేంద్రం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద భావాలను పెంచుతూ దేశంలోని విశ్వవిద్యా లయాలలో అభ్యుదయ భావజాలం పైన దాడులను ప్రోత్సహిస్తుందని, శాస్త్రీయ విధానాలకు విరుద్ధంగా విద్యార్థులకు పురాణాలు వల్లించి వారి మెదడులు మొద్దుబారె విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం విద్య ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను విద్యను దూరం చేస్తుందన్నారు. కేసిఆర్ అనుసరిస్తున్న విధానాలు వలన విద్య అందని ద్రాక్షగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పోరాటం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థి ఉద్య మంలో ఎస్ఎఫ్ఐ ముందుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, మధు, ప్రవీణ్, ప్రేమ్ కుమా, నితిష్, కావ్య, భాగ్యశ్రీ, శ్రావణి పాల్గొన్నారు.