Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదలకే చేయూతనివ్వాలి : ఎమ్మెల్యే సండ్ర
నలుగురు విద్యార్థులకు రూ.50వేలు చొప్పున ఐదేండ్లు ఆర్థికసాయం
నవతెలంగాణ- కల్లూరు
ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగితే పేదరికం అడ్డుకాదని జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ అన్నారు. శుక్రవారం స్థానిక తెలంగాణ గ్రామర్ పాఠశాల యాజమాన్యం నీట్ పరీక్షలో మండలంలో ఆరుగురు విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు క్రిసెట్ పార్మా కంపెనీ అధినేత, తెలంగాణా గ్రామర్ స్కూల్ చైర్మన్ ఎస్కె జానిమియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు మెడికల్‌లో సీట్లు సాధించడం అంటే గొప్ప విషయమన్నారు. విద్యార్థులు ప్రభుత్వ, గురుకుల, నవోదయ పాఠశాలలో చదువుకొని ఆ తమ లక్ష్యాన్ని సాధించి పేదరికం అడ్డుకాదని నిరూపించారన్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అసలైన పేదలను గుర్తించి సహాయమందిస్తాయనే ఫలితమిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులతో పేదరికాన్ని గుర్తించటం కష్టసాధ్యంగా మారిందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లుగా ఆర్ధిక సహాయం చేస్తూ ముందుకు పోవటంతో ఈ రాజకీయాలు ఎటుదారి తీస్తాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిసెంట్ ఫార్మా అధినేత జానిమియా మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో పేదరికంలో ఉన్నానని, ఉన్నత చదువులు చదువుకోలేకపోయానని అన్నారు. నిరుపేదలైన విద్యార్థులకు మెడికల్ సీట్లు సాధించినట్లు తన మిత్రుడు పసుమర్తి. చంద్రరావు, ఎమ్మెల్యే వెంకట వీరయ్య ద్వారా తెలుసుకొని వారికి ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేయటానికి తాను ముందుకు వచ్చినట్లు తెలిపారు. కనపర్తి కృష్ణవేణి, జనుపాటి సుష్మా, గోట్రు నికిల్‌కు ఒక్కొక్కరికి సంవత్సరానికి యాభ్కె వేల చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి జానిమియా కలెక్టర్ చేతుల మీదగా మొదటి సంవత్సరం కింద 50 వేలు విద్యార్థులకు అందించి ఘనంగా సన్మానం చేశారు. ఖమ్మం ఎంప్లాయ్మెంట్ అధికారి వేల్పుల విజేత కనపర్తి కృష్ణవేణికి యాభై వేల చొప్పున ఐదు సంవత్సరాలపాటు అందిస్తానని కలెక్టర్ చేతుల మీదగా యాభ్కె వేలు అందజేశారు. గాయత్రి అధినేత వద్దిరాజు రవిచంద్ర పెదవేగి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లికకు 50 వేలు చొప్పున ఐదు సంవత్సరాల అందిస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ద్వారా యాభై వేల రూపాయలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి సన్మానించారు వరక .అక్షర, వేము సాహితీ, ఎస్కె.నఫిజాలకు తెలంగాణ గ్రామర్ పాఠశాల యాజమాన్యం ఒక్కొక్కరికీ పది వేలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్. సూర్యనారాయణ, ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజరుకుమార్, సొసైటీ అధ్యక్షులు పాలెపు రామారావు, డిసిసిబి డైరక్టర్ బోబోలు. లక్ష్మణ్‌రావు, రైతు సమితి జిల్లా, మండల ప్రతినిధులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, పెనుబల్లి జెడ్పీటీసీ చక్కిలాల మోహన్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ. ఇస్మాయిల్, ఎస్కే కమిళి, మాజీ ఎంపీపీ ఆత్తునురి. రంగారెడ్డి, ఎంఈఓ ఎం.రాములు, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎండీవో టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను శాలువాతో ఘనంగా సత్కరించారు.