Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నగరంలోని న్యూవిజన్ పాఠశాలలో నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ అబాద్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు సామాన్య శాస్త్ర నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో జీవ, రసాయన, భౌతిక, వృక్ష శాస్త్రాల నమూనాలు అబ్బుర పరిచాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో శాస్త్ర విజ్ఞానం వెల్లివిరుస్తుందనీ, జీవన క్రమం, పారిశ్రామిక రంగం శాస్త్ర దృక్పథంతో ముందుకు సాగినప్పుడు ఆదేశం కాని, ఆ రాష్ట్రం గాని త్వరిత గతిన పురోగతిని సాధిస్తుందని, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ అబాద్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూవిజన్ విద్యాసంస్థల ఛైర్మన్ సిహెచ్.జి.కె. ప్రసాద్, ప్రిన్సిపాల్ అబాద్ అలీ, సి.హెచ్.మాధవి, పాఠశాల ఎ.ఒ., డి.వెంకటరెడ్డి మరియు సైన్స్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.