Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికులు భాగస్వాములు కండి : సీఐటీయూ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ రక్షణకు మార్చి 28, 29 రెండు రోజులు జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు భాగస్వాములు కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు అన్నారు. బుధవారం కార్పొరేటులోని మెయిన్ వర్క్ షాపు నందు జరిగిన ఫిట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మటం, కార్మిక చట్టాలను మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేయటం జరుగుతుందని తెలిపారు. అధిక ధరలతో ప్రజలపై భారాలు మోపడం, కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న హక్కులు లేకుండా హాయర్ అండ్ ఫైర్ పద్ధతి ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా చేయటం, ఇలాంటి ప్రధానమైన డిమాండ్లపై దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలసి బిజెపి విధానాలను తిప్పికొట్టేందుకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. సింగరేణి కార్మికులు కూడా ఈ రెండు రోజుల సమ్మె విజయవంతం చేసి సింగరేణి సంస్థ రక్షణ కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో సింగరేణి రక్షణ కోసం ఈ సమ్మెలో పాల్గొని సింగరేణి రక్షణ కోసం కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు గాజుల రాజారావు, బ్రాంచి నాయకులు కర్ల వీరస్వామి, వెంకన్న, కూరపాటి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.