Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీలకు ఇబ్బందులు కలగకుండా చూడండి
- కార్యదర్శులను ఆదేశించిన ఎంపీడీఓ
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలోని పంచాయతీల వారీగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులకు కూలీలను పెంచాలని ఎంపీడీవో అన్నపూర్ణ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండుతున్న ఎండల నేపథ్యంలో కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ ఆఫీసర్, తోట తులసీరామ్, గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శులు, ఏపీఓ శ్రీనివాసరావు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.