Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-భద్రాచలం
గ్రామ సభల ద్వారా దళిత బంద్ ఎంపికలు నిర్వహించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంనకు తంబళ్ళ కృష్ణార్జున రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంద్ ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజా ప్రతినిధులు వాటలుగా పంచుకోకుండా, గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆయన అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం వెయ్యి మందికి దళిత బంద్ మంజూరు చేయాలని ఆయన అన్నారు. కేవలం 100 మందికి ఈ పథకం ఇవ్వటం వల్ల పూర్తిస్థాయిలో ఇది ఎప్పుడూ పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ టౌన్ అధ్యక్షులు మందా రమణయ్య, గౌరవ అధ్యక్షులు నకిరికంటి నాగరాజు, మాజీ ఎంపీటీసీ చేగోండి శ్రీనివాసరావు, కాపుల సూరిబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.