Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
నవతెలంగాణ-గుండాల
ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా గుండాల సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంధా మండల నాయకులు తెల్లం రాజు, ఈసం సింగన్న, మండల కో-ఆప్షన్ జావిద్ పాష, కోడూరి జగన్, కృష్ణ, ఎస్కే వసీం, ఐఎఫ్టీయూ మండల కార్యదర్శి గుర్రం పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేటలో ప్రజాపంధా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టి డివిజన్ నాయకుడు వి.బుచ్చిరాజు, మండల నాయకులు కె.అర్జన్, పండా ముత్యాలు, బి.లక్మన్ రావు, కె.బాబు రావు, జె.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి :ఉక్రెయిన్-రష్యా సైనిక బలగాల మధ్య జరుగుతున్న యుద్ధం నిలిపివేసి శాంతిని నెలకొల్పే విధంగా ఐక్యరాజ్యసమితి కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు డి.ప్రసాద్, మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మ చారి అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టేకులపల్లిలో ఉక్రేయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగ వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథా డివిజన్ నాయకులు అజాద్, మండల నాయకులు సుందర్, నాగరాజు, లింగా, లింగయ్య పంతులు, గోపాల్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : ఉక్రెయిన్‌పై రష్యాయుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూధన్‌రెడ్డి డిమాండు చేశారు. సురక్షాబస్టాండ్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తూ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎండి.గౌస్, తిరుపతి, రామయ్య, రాములు, టి.శ్యామ్, సంజీవరెడ్డి, రాధాకృష్ణరెడ్డి, పి.వి నర్సయ్య, వెంకటేశ్వర్లు, సత్యం, నారాయణ, పాల్గొన్నారు.
పాల్వంచ : ఉక్రెయిన్ దేశంపై...దుంధుడుకు చర్యలను ఖండిస్తూ సీపీఐ ఎంఎల్ ప్రజాఫంథా పార్టీ ఆద్వర్యంలో పాల్వంచ బస్టాండ్ సెంటర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దిష్టి బోమ్మ దహనం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాఫంథా పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు, రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి రమేష్, ఐప్టియు జిల్లా కోశాదికారి గోనేల రమేష్, ఏరియా అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.