Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వ భూమి
- పాత్రికేయుల సమావేశంలో ఆధారాలతో బయటపెట్టిన గిరిజన సంఘాలు
నవతెలంగాణ-పినపాక
గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించి పేదరికంలో ఉన్న గిరిజనులకు పంచాలని దానితో పాటు గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ ఆదివాసి అభ్యుదయ గిరిజన సంఘం, గిరిజన సంఘాల నాయకులపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ దొర మండిపడ్డారు. పినపాక మండలం ఐలాపురం గ్రామంలోని ఎక్స్-15 ప్రభుత్వ భూమిని నిరుపేద గిరిజనులకు పంచాలని పోరాటం చేస్తుంటే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బుధవారం తెలంగాణ ఆదివాసి అభ్యుదయ గిరిజన సంఘం, తుడుందెబ్బ, ఆదివాసీ సేన ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని టీఏజీఎస్ మండల అధ్యక్షులు కొమరం శ్రీను అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని అల్లంపల్లి రెవెన్యూ పరిధి ఐలాపురం గ్రామంలోని ఎక్స్-15 సర్వే నెంబరు గల ప్రభుత్వ భూమిపై జరుగుతున్న వివాదం తప్పును కప్పిపుచ్చుకోవడానికే అని, అది ప్రభుత్వ భూమి అని ఆధారాలతో జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల రామకృష్ణ దొర విలేకరుల సమావేశంలో బయట పెట్టారు. ఆర్టిఐ ద్వారా సేకరించిన ఆధారాలను విలేకరులకు చూపించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కొమరం శ్రీను, ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య, ఉపాధ్యక్షులు కొమరం రామారావు, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆదివాసీ సేన మండల కన్వీనర్ సోలం వినరు కుమార్, ఆదివాసి అడ్వకేట్ దనసరి నరసింహమూర్తి పాల్గొన్నారు.